జైల్లో అగ్ని ప్రమాదం సంభవించటంతో ఖైదు అనుభవిస్తున్న 41మంది ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘోర సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 39మంది తీవ్ర గాయాల పాలవ్వగా వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు.
జకార్తా శివారులోని టాంగెరాంగ్ జైల్లోని సీ బ్లాక్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహయక చర్యలు కొనసాగుతుండగా… అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.