హైదరాబాద్ కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
మంటలు భారీగా ఎగిసి పడడంతో పక్కనే ఉన్న షాపులకు వ్యాపించకుండా ప్రయత్నించారు ఫైర్ సిబ్బంది. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. పోలీసులు స్థానికంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.