మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని ముంబైలోని 20 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 23 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
మొదట 18వ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. గాయాలైన వారిని సమీపంలో ఉన్న భాటియా ఆస్పత్రికి తరలించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి బీజేపీ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధా, ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
Advertisements
భవనంలో మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తరలించామని అధికారులు తెలిపారు. దట్టమైన పొగలు కమ్మేయడంతో కొంతమందికి ఊపిరి ఆడకు ఇబ్బంది పడ్డారని ఆరుగురు వృద్దులకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని చెప్పారు.