మేడ్చల్ జిల్లా నాచారం పీఎస్ పరిధిలోని గ్రీన్స్ కాలనీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అనిల్ అనే వ్యక్తి ఫ్లాట్ లో మంటలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు సిబ్బంది. ఫ్లాట్ లోని బాత్రూంలో అనిల్ ను అపస్మారకస్థితిలో గుర్తించారు.
అనిల్ ఇంజెనాయిల్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఫ్లాట్ మొత్తం పొగతో నిండిపోయింది. ఆ సమయంలో అతను బాత్రూంలో ఉండటంతో బయటకు రాలేక అక్కడే పడిపోయాడు. ఫైర్ సిబ్బంది అనిల్ ను 108లో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.