రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం దగ్గరకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ముందుగానే గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మంటలను గమనించిన వెంటనే ప్రయాణికులంతా బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. అయితే వారి సామాగ్రి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో బస్సుతోపాటు అవికూడా పూర్తిగా దగ్ధం అయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.