ఢిల్లీ : తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఈ రైలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఢిల్లీ సమీపంలోకి చేరుకోగానే రైల్లో మంటలు వ్యాపించాయి. పాంట్రీ, ఎస్ 10, బి1 బోగీల్లో మంటలు వచ్చినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. మంటలంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
ప్రయాణికుల్లో తొలివెలుగు అభిమాని ఒకరు వాట్సాప్ ద్వారా పంపించిన చిత్రం