విశాఖ నగరాన్ని వరుస ప్రమాదాలు ముంచెత్తుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్, ఫార్మా సిటీ బ్లాస్ట్, క్రేన్ ప్రమాదం ఇలా వరుస ప్రమాదాలు సంభవించగా ఇప్పుడు విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నిలిపి ఉన్న నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. పనామా BD51నౌక క్యాబిన్ నుంచి పొగలు వస్తున్నట్టు గుర్తించారు, చెన్నై నుంచి వచ్చిన ఈ నౌక వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్ లో ఉండగా ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం ఇంజన్ రూమ్ లో కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలను అదుపు చేస్తున్నారు సిబ్బంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోర్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.