హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఈ ప్రమాదంలో నాలుగు కార్లు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని, మంటలను అదుపు చేస్తున్నారు.
ఓ ఎలక్ట్రిక్ కారులోంచి మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా నాంపల్లి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వీకెండ్ కావడంతో నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కు భారీగా జనం పోటెత్తారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.