ఉక్రెయిన్ పై రష్యా భీకరమైన దాడులను చేస్తోంది. తాజాగా మరింత విధ్వంసం సృష్టించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లను టార్గెట్ చేస్తోంది.
యూరప్ లోని అత్యంత పెద్దదైన అణు విద్యుత్ కేంద్రం జప్రోజాహియాపై రాకెట్ దాడులకు దిగింది. దీంతో న్యూక్లియర్ రియాక్టర్ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. దీనివల్ల రియాక్టర్ నుంచి రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ రియాక్టర్ లో పేలుడు సంభవించి ఉంటే అది పెద్ద ఎత్తున విధ్వంసానికి దారి తీసి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ టెలివిజన్ తో ప్లాంట్ ప్రతినిధి ఆండ్రీ తుజ్ మాట్లాడుతూ… ‘ఎనెర్హోదర్ నగరంలోని జపోరిజ్జియా ప్లాంట్ పై నేరుగా బాంబులు పడుతున్నాయి. ఇందులో ఆరు రియాక్టర్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. ఇటీవల ఆ రియాక్టర్ పని చేయడం లేదు. అందువల్ల దాన్ని పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కానీ అందులో అణు ఇంధనం ఉంది’ అని తెలిపారు.
Advertisements
జపోరిజజియాపై అన్ని వైపుల నుంచి రష్యా సైన్యం దాడులు చేస్తోంది. ఒక వేళ అందులో పేలుడు సంభవించి ఉంటే చెర్నోబిల్ కంటే 19 రెట్లు విధ్వంసం జరుగుతుంది. అందువల్ల రష్యా సైన్యం కాల్పులను విరమించాలి.. మంటలు ఆర్పేందుకు ఉక్రెయిన్ ఫైర్ అధికారులకు అవకాశం ఇవ్వాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమైట్రో కులేబా ట్వీట్ చేశారు.