తిరుపతి జిల్లాలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రేణిగుంట ఫాక్స్ లింక్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెల రేగాయి. మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి.
మంటలను చూసి భయంతో కార్మికులు ఫ్యాక్టరీ నుండి బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి ఫ్యాక్టరీ సిబ్బంది విషయాన్ని ఫైర్ డిపార్ట్ మెంట్ కు అందజేశారు.
సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీ రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. దీంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇతర ప్రాంతాల నుండి కూడా ఫైరింజన్లను రప్పించారు.