పార్లమెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రూమ్ నెంబర్ 59లో మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని వెంటనే గమనించిన ఫైర్ సిబ్బంది క్షణాల్లోనే మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో కొన్ని కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు దగ్ధం అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు అధికారులు.