రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామ శివారులో జరిగిందీ ఘటన. 65వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుండగా… కారు ఇంజిన్ ఫెయిల్ అయి షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మంటలను గమనించడంతో సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే జహీరాబాద్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.