హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రయాణిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అత్తాపూర్ వద్ద వేగంగా వెళ్తూ.. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు కారు వద్దకు చేరుకుని అందులో ప్రయాణిస్తున్న వారిని బయటకు తీశారు. ఆ తర్వాత వారు చూస్తుండగానే.. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది.
అగ్ని మాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.