శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. AP27 CC 0206 నెంబర్ ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు కారంతా వ్యాపించడంతో అందులో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.
ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ కారుపై రెండు చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో సీట్ బెల్ట్ పెట్టుకోని కారణంగా కరీంనగర్ టౌన్ లో ఫైన్ వేయగా.. 2019 ఏప్రిల్ లో షాద్ నగర్ లో ఓవర్ స్పీడ్ కారణంగా జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. కారు దగ్ధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.