హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో కంపెనీలోని కెమికల్ ల్యాబ్ లో ఒక్క సారిగా రియాక్టర్ లో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి.
ప్రమాదం గురించి అగ్ని మాపక సిబ్బందికి కంపెనీ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పి వేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిద్దరూ అదే కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
మృతులను రవీందర్‌రెడ్డి(25), కుమార్(24)గా పోలీసులు గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒక్క సారిగా మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వేసవి కాలం ప్రారంభమవుతోందని, అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. వేసవి సమయంలో చిన్న నిర్లక్ష్యం చేసినా పెద్ద ప్రమాదాలు జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. అందువల్ల అలా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.