బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ విలన్ గా నటించారు. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావటంతో సినీ అభిమానులు థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటె వరంగల్ లో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనితో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కొద్దిసేపటి తరువాత మంటలను అదుపు చేశారు.