షామిర్ పేటలో సోమవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వైన్స్ షాప్ షట్టర్ పై దోపిడీ దొంగలు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. షాపు యజమాని బాలకృష్ణను, సిబ్బందిని బెదిరించి రూ. 2 లక్షలు దోచుకెళ్లారు.
ఇది అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమకు అడ్డు వచ్చిన షాపు సిబ్బందిపై ఈ దొంగల్లో కొందరు కర్రలతో దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది.
దొంగలను పట్టుకునేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మూడ చింతలపల్లి మండలం ఉద్దెమర్రి వద్ద గల వైన్ షాపు పై ఈ దాడి జరిగింది.
సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడినట్టు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి జరిగిన ఈ తుపాకీ కాల్పులతో స్థానికులు భయాందోళన చెందారు.