ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మొదటి కరోనా కేసు నమోదైంది.లండన్ లో నుంచి తిరిగొచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ గా తేలింది. ఆమె లండన్ లో చదువుకుంటుంది. ఆమెను హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించి పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించే అవకాశాలుండడంతో లాక్ డౌన్ ప్రకటించిన 32 రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. ఇప్పటి వరకు దేశంలో 470 కేసులు పాజిటివ్ గా తేలాయి. 9 మంది చనిపోయారు.