తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదు అయింది. కరోనా వైరస్ సోకినా 70 ఏళ్ల వృద్దుడు చనిపోయాడు. అయితే అతను చనిపోయిన అనంతరం అతని రిపోర్ట్ లు వచ్చాయని..అందులో అతనికి కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మృతుడు హైదరబాద్ లోని ఖైరతాబాద్ కు చెందిన వ్యక్తి అని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం అతను ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లాడని, అనారోగ్యానికి గురి కావటంతో గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు అని ప్రకటించారు.
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు 6 కేసులు పాజిటివ్ అని తేలడంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 65కు చేరుకున్నాయి. అయితే ఇందులో 10మందికి తాజాగా నయం అయింది అని, తాజా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది అని… అయితే మరోసారి వారికి పరీక్షలు నిర్వహించి, డిశ్చార్జ్ చేస్తామని మంత్రి ప్రకటించారు.