భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని 75 సంవత్సరాల వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందటం ఇప్పుడు ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే… ఈ కేసులో హైదరాబాద్‌లోని బడా ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని కల్‌బుర్గి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ బడా కార్పోరేట్ ఆసుపత్రికి తరలించగా… అతనికి కరోనా లక్షణాలుండటంతో గాంధీకి తరలించాలని సూచించారు. దీంతో అతని బంధువులు గాంధీకి కాకుండా మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ కరోనా లక్షణాలున్న వ్యక్తి బంధువుకు డాక్టర్ పరిచయం ఉండటంతో… అక్కడ చేర్పించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా కరోనా అనుమానంతో చికిత్స చేయకపోవటంతో… బంజరాహిల్స్‌లోని గుండె సంబంధిత చికిత్సలకు ఫేమస్ అయిన ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చెస్ట్ ఎక్స్‌రే పరిశీలించిన వైద్యులు… ఉపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉందని, చనిపోయే ప్రమాదం ఉందని గ్రహించి అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు.
దీంతో అతన్ని తిరిగి కర్ణాటకకు తరలించగా… అక్కడే అతను చనిపోయాడు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు కూడా కరోనా చికిత్స అందిస్తాయని ముందుకు వచ్చాయంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న పరిస్థితి లేదని అర్థమవుతోంది.
అయితే అతను కరోనా వ్యాధితో చనిపోయాడని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.రాములు దృవీకరించారు.
The 76 year old man from Kalburgi who passed away & was a suspected #COVID19 patient has been Confirmed for #COVID19. The necessary contact tracing, isolation & other measures as per protocol are being carried out.
— B Sriramulu (@sriramulubjp) March 12, 2020