కేరళలో శనివారం మొదటి సారిగా ఓ కరోనా పేషెంట్ చనిపోయాడు. కొచ్చికి చెందిన అతను మార్చి 22 న తీవ్రమైన న్యూమోనియా, బీపీ లక్షణాలతో హాస్పిటల్లో చేరాడు. అతనికి అంతకు ముందే బైపాస్ సర్జరీ అయ్యింది. దీంతో అతన్ని హై రిస్క్ కేటగిరీ కింద చేర్చి చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతూ మృతి చెండాడు. మృతుడు కొద్ది రోజుల క్రితమే దుబాయ్ వెళ్లొచ్చాడు. అతనితో సన్నిహితంగా మెలిగిన వారందరని ఇప్పటికే క్వారంటైన్ కు పంపినట్టు అధికారులు తెలిపారు.
కేరళలో శుక్రవారం ఒక్క రోజే 39 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 176 కు చేరింది. వారిలో 12 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా…164 మంది చికిత్స పొందుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం రూ.20 వేల కోట్ల రూపాయల రిలీఫ్ ఫండ్ ను విడుదల చేసింది.