ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. పలు దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం యూకేలో నమోదైంది. ఒమిక్రాన్ కేసులు యూకేలోనే భారీగా నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇంతలో మొదటి మరణం అక్కడే నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉందని.. పరిస్థతి ఇలాగే సాగితే.. మరికొన్ని నెలల్లో 75 వేలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని అక్కడి పరిశోధన సంస్థలు హెచ్చిరిస్తున్నాయి.
ఈ 63 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించింది. ఇప్పటి వరకు 7816 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే యూకేలోనే 3137 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.