తెలంగాణలో మళ్లీ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ప్రారంభం అయింది. ఇప్పటిదాకా సెకెండ్ డోస్ వాళ్లకే టీకాలు అందిస్తుండగా.. ఇవాళ్టి నుంచి మొదటి డోస్ వారికి కూడా వేస్తున్నారు. సుమారు 10 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల చివరి కల్లా సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వాళ్ల సంఖ్య దాదాపు 40 లక్షలు ఉండడంతో.. జులై చివరి నుంచే 21 జిల్లాల్లో మొదటి డోస్ వేయడం ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆయా జిల్లాల్లో తిరిగి ప్రారంభించారు.