అగ్రరాజ్యం అమెరికాలో వర్ణ వివక్షకు అద్దం పట్టే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బాల నటిగా డిస్నీ ఛానల్ లో కనిపిస్తూ .. ప్రస్తుతం డిస్నీ వారి స్పిన్ చిత్రంలో కనిపించే భారత సంతతికి చెందిన నటి అవంతిక వందనపు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
తన చిన్నతనంలో రంగు ఆధారంగా తనను “పాకీ” అంటే పాకిస్తాన్ జాతీయురాలుగా కామెంట్ చేసేవారని, చిన్నచూపు చూసేవారని వాపోయింది పదహారేళ్ల అవంతిక. అయితే ఇప్పుడు సోషల్ మీడియా చైతన్యం కారణంగా వర్ణ వివక్ష తగ్గుతూ వస్తోందని అభిప్రాయపడింది.