జీవితంలో దాదాపుగా ప్రతీ ఒక్కరికి ఏదోక ప్రేమ కథ ఉంటుంది. అది ఏ విధమైన జ్ఞాపకాలు ఇస్తుంది ఏంటీ అనేది మాత్రం తర్వాత తర్వాత అర్ధమవుతుంది. ఇక సినిమా స్టార్స్ జీవితానికి వస్తే ముందు ప్రేమ అంటూ తిరిగినా కెరీర్ కాస్త స్పీడ్ అయ్యాక అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇలా ప్రేమ వ్యవహారాలను నడిపిన తెలుగు హీరోయిన్లను చూద్దాం.
తాప్సి
టాలీవుడ్ లో అంతగా క్లిక్ అవ్వకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. అక్కడ స్టార్ దర్శకుల సినిమాల్లో చేస్తూ బిజీగా ఉంది. తన ప్రేమ కథ గురించి ఒకసారి బయట పెట్టింది. తన స్నేహితుల కంటే తాను చాలా ఆలస్యంగా ప్రేమలో పడ్డానని చెప్పిన ఆమె… తాను 9వ తరగతిలో మొదటిసారి ప్రేమలో పడినట్టు తెలిపింది.
నిధి అగర్వాల్
నాలుగో తరగతిలోనే తాను ప్రేమలో పడ్డా అని కొన్నాళ్ళ తర్వాత అతనితో డేట్ కి కూడా వెళ్లాను అని చెప్పుకొచ్చింది. అయితే అది బ్రేక్ అవ్వడంతో లైఫ్ లో ఇక ప్రేమ జోలికి వెళ్లలేదని తెలిపింది.
కియారా అద్వాని
బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మాయి పదో తరగతిలో ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ విషయం ఇంట్లో కూడా తెలిసింది. తన తల్లి చదువుకోమని చెప్పిందని అది కేవలం అట్రాక్షన్ మాత్రమే అని పేర్కొంది.
శృతి హాసన్
ఇప్పుడు సీనియర్ హీరోలకు మొదటి ఆప్షన్ గా మారిన ఈ అమ్మాయి కిండర్ గార్డెన్ స్కూల్ లో ఉన్న చదువుతున్న సమయంలో ఆదామ్ అనే అబ్బాయితో మొదటి సారి ప్రేమలో పడిందట. కాని అది బ్రేకప్ అయిందని పేర్కొంది.