ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి ఇటీవల ఐర్లాండ్ నుంచి వచ్చాడు. మొదట ముంబైలో జరిగిన పరీక్షల్లో నెగెటివ్ అని రావటంతో.. ఆయన విజయనగరం చేరుకున్నారు.
అయితే, స్వగ్రామానికి వచ్చిన తరువాత మరోసారి టెస్ట్ చేస్తే ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. దీంతో, బాధితుడిని ఐసోలేషన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు తెలిపారు. కాగా.. ఏపీలో నమోదైన ఈ కేసుతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 34కు చేరింది.