తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎలా మీడియాను అణచివేస్తున్నారు, తమ మాట వినకుండా… స్వతంత్రంగా వ్యవహరించే టీవీ9 వ్యవస్థాపక సీఈవో రవిప్రకాశ్ లాంటి వారిపై ఎలా కుట్రలు పన్ని కేసులు వేస్తున్నారు, ఎలా మీడియాను తమ చెప్పుచేతల్లోకి తీసుకొవాలనుకుంటున్నారో… వివరంగా, విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది.
టీవీ9ను కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చాక బెదిరించటం, 10అడుగుల లోతున బొందపెడుతాననటం, రెండోసారి అధికారంలోకి వచ్చాక అసలు టీవీ9నే తన అతి దగ్గరి మిత్రులైన రియల్ ఎస్టేట్ వ్యాపారి రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డిలు ఎలా హాస్తగతం చేసుకున్నారు అన్న అంశాలపై వివరంగా కథనాలను ప్రచురించింది. టీవీ9 నుండి రవిప్రకాశ్‌ను ఎలా బయటకు పంపారు, ఆర్థికపరమైన కేసుల్లో ఇరికించారో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. గంటల కొద్ది విచారణ సాగాక, కేసులు నమోదు అయ్యాక… ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న రవిప్రకాశ్‌ను మళ్లీ ఎందుకు వెంటాడుతున్నారు, వారి లక్ష్యం ఎంటో వివరించింది. అంతేకాదు… తనకు సంబంధం లేని అంశంలో, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2ముద్దాయిగా ఉండి, సీబీఐ,ఈడీల విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి ఎందుకు మద్యలో దూరి… సుప్రీం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయటంలో మర్మంపై కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.
ఒక్క కేసీఆర్‌ను మాత్రమే కాదు… ఇటు జగన్‌నూ వదలలేదు. జగన్ గతంలో చేసిన యెల్లో మీడియా ప్రచారం, తాను అధికారంలోకి రాగానే… మీడియాను ఎలా చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, మీడియా ప్రకటనల పేరుతో తన సంస్థలకు ఎలా దోచిపెడుతూ, తన మాట విన్న వారికి పంచిపెడుతున్నారు… తనను వ్యతిరేకించిన వారిని ఎలా టార్గెట్ చేస్తున్నారు, కేబుల్ అపరేటర్లను ఎలా బెదిరిస్తున్నారో వివరించింది.
తెలుగులో ప్రధాన చానళ్లలో పారిశ్రామిక వెత్తలకు ఎవరికెంత వాటాలున్నాయి, ఎలా చొరబడ్డారు… ఇండిపెండేంట్ జర్నలిజాన్ని ఎలా చంపేస్తున్నారో వివరించింది.
ఫస్ట్‌పోస్ట్.కామ్ ప్రచురించిన కథనం యాధావిధిగా తొలివెలుగులో….