షబ్నం అలీ… 2008 తర్వాత ఈ పేరు వింటే ప్రపంచం భయపడటమే కాదు చాలా మంది తల్లి తండ్రులు కంగారు పడ్డారు. ప్రియుడి తో పెళ్ళికి అంగీకరించలేదు అని… తల్లి తండ్రులతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా నరికి చంపింది. దీనితో ఆమెకు స్థానిక కోర్ట్ పై కోర్ట్ లు అన్నీ కూడా ఉరి శిక్షను విధించడం, సమర్ధించడంతో ఆమెను ఉరి తీసే సమయం దగ్గరకు వచ్చింది.
రాష్ట్రపతి కూడా ఆమెను ఉరి తీయాలని చెప్పారు. అయితే డెత్ వారెంట్ పై సంతకం చేసే టైం లో ఆమె కుమారుడు చేసిన విజ్ఞప్తి హైలెట్ అయింది. షబ్నం మరియు ఆమె ప్రియుడు సలీంకు మరణశిక్షను 2012 ఆగస్టు 16 న అప్పటి జిల్లా జడ్జి అమ్రోహా ఖరారు చేసారు. ఈ జంట మరణశిక్షను ఉన్నత కోర్టులలో అనేకసార్లు సవాలు చేసినప్పటికీ, శిక్షను సమర్థించారు. మధుర జిల్లా జైలులో షబ్నం ఉరి తీయబడగా, సలీంను ఎక్కడ ఉరితీస్తారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
షబ్నం 12 ఏళ్ల కుమారుడు తాజ్ మహ్మద్ తన తల్లికి క్షమాపణ కోరుతూ ఒక పలక పట్టుకుని ఉన్న ఫోటో వైరల్ అయింది. అదే సమయంలో, యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముందు షబ్నం తన క్షమాభిక్ష పిటీషన్ ను దాఖలు చేసారు. ఆమెను ఉరితీయడానికి మధుర జైలులో ఏర్పాట్లు చేస్తున్నారు. మన దేశంలో ఉరి శిక్షను ఎదుర్కొంటున్న తొలి మహిళ ఆమెనే. షబ్నం ప్రస్తుతం రాంపూర్ జిల్లా జైలులో ఉండగా సలీం ఆగ్రా జైలులో ఉన్నారు.
1870 లో నిర్మించిన మధుర జిల్లా జైలులో ఒక మహిళను ఎప్పుడూ ఉరి తీయలేదు. 6 ఏప్రిల్ 1998 న, రాముశ్రీ అనే మహిళను మధుర జిల్లా జైలులో ఉరి తీయవలసి ఉంది. కాని ఆమె జైలులో ఉన్న సమయంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాబట్టి ఆమె మరణశిక్షను మానవతా ప్రాతిపదికన జీవిత ఖైదుకు మార్చారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడటం లేదు. వచ్చే నెలలో ఆమెను ఉరి తీసే అవకాశం ఉంది.