ఎస్ ఆర్ నగర్‌లో చేపల వ్యాపారి కిడ్నాప్ వ్యవహరం విషాదాంతం అయ్యింది. రమేష్ అనే చేపల వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు 90లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ కిడ్నాప్ జరగ్గా… జూబ్లీహిల్స్‌లోని కళ్యాణ్ నగర్‌లో ఓ గొనె సంచిలో రమేష్ మృతదేహం లభించింది. రమేష్ మృతదేహం కాళ్లు-చేతులు కట్టిపడేసి రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఫిబ్రవరి 1వ తేదీన ఇంట్లో నుండి వెళ్లిన రమేష్ రెండ్రలైనా ఇంటికి తిరిగి రాకపోవటంతో ఫిబ్రవరి 3న కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు పోలీసులు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే జూబ్లిహిల్స్ లోని ఓ ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో… ఇంటి యజమాని రూం ఓపెన్ చేసి చూసే సరికి గోనే సంచిలో ఉన్న మృతదేహాన్ని గమనించటంతో పోలీసులకు సమాచారమివ్వగా మృతదేహం రమేష్‌దేనని పోలీసులు గుర్తించారు.
అయితే, ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న శ్రీనివాస్-అరుణలు పరారీలో ఉండటంతో వారికి ఈ హత్యతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే హత్య జరిగిందని, మిస్సింగ్ కేసుపై ఫిర్యాదు చేసిన పోలీసులు సరిగ్గా స్పందించలేదని రమేష్ బంధవులు ఆరోపిస్తున్నారు.