మితంగా తింటే ఆహారం. అమితంగా తింటే విషం. పోటీ కోసం అంతకుమించి లాగించేస్తే విశేషం.! బిహార్ లో మదర్ కుమార్ అనే చేపలవ్యాపారి చేపలు తినడంలో చేవ చూపించాడు.15 నిమిషాల్లో 75 చేపముక్కలు తిని…అది కడుపా చెరువా !అనిపించాడు. ఇప్పుడీ న్యూస్ టాక్ ఆఫ్ ద ఫుడ్ వరల్డ్ గా మారింది.
పాట్నాలో చేపల విక్రయాలను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర జాలర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగింది. దీంట్లో చాలా మంది జౌత్సాహికులు పోటీలో నోళ్ళు మెదిపారు. కానీ మదన్ కుమార్ ని మించలేక పోయారు ఒక వ్యక్తి మాత్రం 15 నిమిషాల్లో 73 చేపముక్కలు తిని రెండో స్థానంలో నిలిచాడు.
మొదటి స్థానంలో నిలిచిన మదన్ కి రూ.10 వేల నగదు బహుమతి గెలుచుకోగా..రెండో విజేతకు రూ. 5 వేల నగదు బహుమతి అందుకున్నాడు. రాజ్ సాహ్ని, జై కుమార్ ఝూ అనే వ్యక్తులు చెరో 60 చేపముక్కలు తిని పర్వాలేదు అనిపించుకున్నారు. వీరికి రూ.2500 బహుమతి లభించింది.
“బిహార్, బంగాల్,ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రాల్లో చాలా మంది చేపల పట్టడం విక్రయించడం వంటి వాటిపైన ఆధారపడ్డారు. మంచి పోషక విలువలు,ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చేపలకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది.దీంతో వీటి విక్రయాలు పెంచే లక్ష్యంతోనే ఈ పోటీలు నిర్వహించాం “ అని నిర్వాహకులు తెలిపారు.