తిరుపతిలో కలకలం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఒకేసారి కనిపించకుండా పోయారు. బుధవారం ఉదయం స్టడీ అవర్స్ కోసం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మూడు బృందాలను రంగంలోకి దించిన పోలీసులు.. విద్యార్థుల సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా గాలింపు కొనసాగిస్తున్నారు. తిరుపతిలోని ఐస్ మహాల్ సమీపంలోని అన్నమయ్య స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు విద్యార్థులు.
నెహ్రూ నగర్ కు చెందిన మెహత, మౌనశ్రీ, గుణశ్రీ అనే విద్యార్థినులు సహా మరో ఇద్దరు విద్యార్థులు కూడా మిస్ అయ్యారు. కాగా.. విద్యార్థులు వెళ్లిన మార్గంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు విద్యార్థులు కనిపించకుండా పోవడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేక వారు కిడ్పాప్ కు గురయ్యారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.