తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు గత నెలరోజులుగా సమ్మెచేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శించటంతో చలో ట్యాంక్ బండ్ కు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కార్మికులను, అఖిలపక్ష నేతలను ముందస్తుగానే శుక్రవారం సాయంత్రం నుంచే అరెస్ట్ లు చేశారు. జిల్లాల్లో ఎక్కడికక్కడే కార్మికులను, నేతలను అరెస్ట్ చేశారు. మొత్తం శనివారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 5000 మందిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ లో 523 మంది , రాచకొండ లో 731 మంది , హైద్రాబాద్ లో 1266 మంది కార్మికులను అరెస్ట్ చేశారు.
వేల మంది పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్యకూడా ట్యాంక్ ముట్టడితో తమ సత్తాచూపారు ఆర్టీసీ కార్మికులు . పోలీసుల లాఠీఛార్జ్ తో ఉద్రిక్తంగా మారిన ట్యాంక్ బండ్ రక్తంతో తడిసింది. మహిళలని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.