అందరు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో మంటలు చెలరేగి 8 నెలల బాలుడు సహా.. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన కేరళలోని తిరువనంతపురమ్ జిల్లాలో చోటుచేసుకుంది.
దవలపురమ్, వర్కాల సమీపంలోని చెరున్నియూర్కు చెందిన ప్రతాపన్.. రాహుల్ నివాస్ లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. సోమవారం అందురు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అందరు నిద్రిస్తుండటంతో ప్రమాదాన్ని గ్రహించలేకపోయారు. మంటల్లో చిక్కుని మృతిచెందారు.
ఇంట్లో చెలరేగుతున్న మంటలకు పొగ కమ్ముకొచ్చింది. అంది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ బృందాలకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
మృతులు ప్రతాపన్(64), అతని భార్య షెర్లీ(53), చిన్న కుమారుడు అఖిల్(25), పెద్ద కూమారుడి భార్య అభిరామి(24), అతని 8 నెలల కుమారుడు రయాన్ గా గుర్తించారు పోలీసులు. తీవ్ర గాయాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిఖిల్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.