ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసపు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియక పోలీసులు, అధికారులు తలలుపట్టుకుంటున్నారు. మరోవైపు ఈ వివాదం కాస్త రాజకీయ రంగును కూడా పులుముకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఈక్రమంలో గుంటూరు జిల్లాలో వెలుస్తున్న ఫ్లెక్సీలు ఆసక్తకరంగా మారాయి. దేవుడా.. నిన్ను నువ్వే కాపాడుకో అంటూ అందులో రాసి ఉండటం చర్చనీయాంశంగా మారింది.
దేవాలయాలు శక్తి కేంద్రాలు.. సనాతన సంస్కృతీ ప్రవాహ స్థావరాలు.. చరిత్రకు సజీవ సాక్ష్యాలు.. స్వామీ!ఆపదలో ఉన్న వాడికి దేవుడే దిక్కు అంటారు… ప్రస్తుతం దేవుడేకే రక్షణ లేకుండా చేశారు… దేవుడా నిన్ను నువ్వే కాపాడుకో అంటూ ఫ్లెక్సీల్లో ఉంది. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో కట్టిన ఈ ఫ్లెక్సీలు అటుగా వెళ్తున్నవారిని ఆలోచించేలా చేస్తున్నాయి.