భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్ ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ పర్యటనలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ , ఫ్లెక్సీలను ఇంకా తీయలేదని కాంగ్రెస్ శ్రేణులు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే దీన్ని స్థానిక బీఆర్ఎస్ నేతలతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. ఫ్లెక్సీలను తొలగించొద్దని బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో ఇరు పార్టీ వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
అయితే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గొడవ సర్దుమణిగింది. ఇక రూల్స్ కు వ్యతిరేకంగా ఇంకా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టడం కార్పొరేషన్ వాళ్ల తప్పు అంటూ..బీఆర్ఎస్ నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.