అచ్చంపేట బీఆర్ఎస్ లో రాజకీయంగా చిచ్చు రాజుకుంది. నియోజకవర్గంలోని బస్టాండ్ సమీపంలో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎంపీ రాములు ఫ్లెక్సీని గుర్తుతెలియని గువ్వల బాలరాజు వర్గీయులు ఆదివారం రాత్రి చించివేశారు.
ఫ్లెక్సీ చించివేతతో.. అచ్చంపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇటీవలే ఎంపీ రాములు, తనయుడు భరత్ ప్రసాద్ అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ప్రజలకు చేరువవుతున్నారు.
ఈ కార్యక్రమాలు గువ్వల బాలరాజు వర్గానికి మింగుడు పడడం లేదు. తన నియోజకవర్గంలో ఇతరులు రాకూడదని ఉద్దేశంతో ఇలాంటి దుర్మార్గపు పనులు చేయిస్తున్నాడని ఎంపీ రాములు వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.