నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణస్వీకారానికి ముందే ఆపార్టీ నాయకులు ఫ్లెక్సీలు చింపివేశారు.
నిడమనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మంత్రిని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మండలపరిషత్ అధ్యక్షుడు, సర్పంచ్ ఫోటో లేకపోవడంతో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈవిషయంలో తలెత్తిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అందులో భాగంగా ఎంపీపీ సామాజిక వర్గం నేతలు ఫ్లెక్సీలు చింపేసినట్టు తెలుస్తోంది.
ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో నియోజకవర్గంలోని అధికార పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.