అభిమాన హీరోపై ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు అభిమానులు. ఎక్కువమంది చూపించే పద్ధతి మాత్రం బ్యానర్లు, కటౌట్లు కట్టడమే. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పుడీ పద్ధతిని కొత్త ఎత్తుకు తీసుకెళ్లారు ఓవర్సీస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ కోసం ఏకంగా విమానంతో బ్యానర్ కట్టారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ట్రయిలర్ లో సూపర్ హిట్టయిన తొక్కుకుంటూ పోవాలే అనే డైలాగ్ ను ఓ బ్యానర్ పై ముద్రించి, ఆ పక్కనే జై ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ అనే అక్షరాల్ని రాసి ఓ విమానానికి కట్టారు. అంతే.. అమాంతం ఆ విమానం గాల్లో తేలింది. భారీ బ్యానర్ ను మోసుకుంటూ గాల్లో చక్కర్లు కొట్టింది.
ఇలా ఆర్ఆర్ఆర్ సినిమాకు, ఎన్టీఆర్ కు వినూత్నంగా ప్రచారం కల్పించారు అభిమానులు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు ఇదొక చిన్న ఎగ్జాంపుల్ గా నిలిచింది.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి దుబాయ్ సెన్సార్ పూర్తయింది. 24వ తేదీనే దుబాయ్ లో ప్రీమియర్స్ పడతాయమని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెయిడ్ ప్రివ్యూలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సినిమా 25వ తేదీన రిలీజ్ కానుండగా.. 24వ తేదీ రాత్రి నుంచే షోలు మొదలుపెట్టాలనుకుంటున్నారు.