హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో నిలిచిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయినట్టు ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెబుతున్నారు. గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. సిబ్బంది బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్సిట్ బస్సులో చాలా మంది ముఖ్యమైన ప్రయాణికులు ఇంకా వేచి ఉన్నారు. ఇప్పటికీ వేరే మార్గం చూసుకోవాలా? ఫ్లైట్ స్టార్ట్ అవుతుందా? అనే విషయం చెప్పడంలేదని అంటున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ఎయిర్ పోర్ట్ లో నిలిచిపో్యిన ఫ్లైట్.. ప్రయాణికుల ఆగ్రహం