ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ నుంచి 154 మంది భారతీయులతో కూడిన విమానం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకుంది.

ఇటీవల ఉక్రెయిన్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ సంక్షోభం, తరలింపు ప్రక్రియపై ప్రధాని మోడీ అత్యన్నత స్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
ఇప్పటి వరకు ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న 13,300 మంది భారతీయులను ఇండియాకు తీసుకు వచ్చినట్టు కేంద్రం శనివారం వెల్లడించింది.