భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌క్లూజివ్ సేల్స్ అంటూ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీని దెబ్బతీస్తున్నాయని వర్తకుల సమాఖ్య ఫిర్యాదు మేరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తమపై విచారణ జరపాలంటూ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్టు కోర్టును ఆశ్రయించింది.
ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే తమపై సీసీఐ దర్యాప్తుకు ఆదేశించిందని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలివ్వగా… ఆ అంశాన్ని పూర్తిగా కొట్టివేయాలంటూ ఫ్లిప్‌కార్టు కోర్టును కోరింది.