కోట్లు ఖర్చు పెట్టి నీళ్లలో తేలియాడే భవనం కట్టించుకుంటే… ఆ యజమానికి ఓపెన్ చేసే రోజే మునిగిపోతే… ఎలా ఉంటుంది. సీపాడ్ పేరుతో పనామా కంపెనీ ఒక భవనాన్ని నిర్మించింది. దాని స్పెషల్ ఏంటంటే.. నీళ్లలో తేలియాడుతూ ఉంటుంది.
ఆ భవంతిలో సుమారు 300 గజాల విస్తీర్ణంలో లివింగ్ రూం ఉంటుంది. ఆ బిల్డింగ్‌కి దూరంగా నీటి మట్టానికి 7.5 అడుగులు ఎత్తులో మూడు హాఫ ఫ్లోర్స్ కూడా ఉంటాయి.ఈ భవనం నిర్మించేందుకు సుమారుగా 1.5 మిలియన్ డాలర్లు.. అంటే మన లెక్కల్లో రూ.12 కోట్లకుపైగా ఖర్చు అయింది.
నీటిలో తేలియాడుతూ ఎంతో అందంగా నిర్మించిన ఆ భవనాన్ని ఓపెన్ చేసేందుకు.. పెద్ద ఎత్తున ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి పనామా కంపెనీ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. అప్పుడు ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా ఆ నీళ్లలో ఉన్న ఆ బిల్డింగ్ అందరూ చూస్తుండగానే అలా ఒక పక్కకు ఒరిగిపోయింది.
అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అది చూసిన వారంతా చాలా భయపడిపోయారు. అలా ఎందుకు జరిగిందనే దానిపై పనామా కంపెనీ వివరణ ఇచ్చింది. సీపాడ్‌లోని బాలాస్ట్ ట్యాంక్, పంపింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య తలెత్తి.. జాకూజీ స్పార్‌లోని నీళ్లు చేరాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
దాని వల్లనే సీపాడ్ ఇలా ఒరిగిపోయిందని, దాని వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని, కనీసం ఎవరి కాళ్లు కూడా తడవ లేదని చెప్పుకొచ్చారు. అయితే బిల్డింగ్ కూలిన వీడియో వైరల్ అవుతుంది.
La empresa Ocean Builders mediante un comunicado señaló que el prototipo del SeaPod Eco comenzó a destabilizarse, sin embargo, se está investigando las causas, mientras se realizan los trabajos en las soluciones apropiadas. confirman que no hubo personas afectadas. #AcontecerC3 pic.twitter.com/4z9ryc6CKK
— Carlos_cuadro (@Carloscuadro9) September 23, 2022