కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్న కేటీఆర్ సొంత నియోజకవర్గ కేంద్రం ఇప్పుడు వర్షపు నీటిలో ఉంది. ఏ గల్లీ చూసినా, ఏ వీధి చూసినా… అంతేందుకు సిరిసిల్ల టౌన్ మెయిన్ రోడ్డు కూడా పూర్తిగా వరద నీటిలోనే ఉంది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు స్థానికంగా ఉన్న చెరువులను కబ్జాకు గురవటంతోనే కాలనీల్లోకి నీరు వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సోమవారం సాయంత్రం నుండే కాలనీలను వర్షపు నీరు ముంచెత్తుతోంది. కనీసం ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టే పరిస్థితి కూడా లేదు. వరద నీటిలో మునిగిపోయిన కాలనీ వాసులను ప్రభుత్వ అధికారులెవరూ పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి. కనీసం చిన్నారులకు పాలు కూడా పట్టించేందుకు అవకావం లేకుండా పోయిందని, కేటీఆర్ జోక్యం చేసుకొని సహయ కార్యక్రమాలు మొదలుపెట్టేలా చూడాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తన సొంత ప్రజలు ముంపులో ఉంటే కేటీఆర్ ప్రగతి భవన్ లో ఉండటం దారుణమని… ఇదేనా కేటీఆర్ నాయకత్వ లక్షణం అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.