జమ్ముకశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్ నాథ్ యాత్రికుల టెంట్లు నీట మునిగాయి. ఎంతో మంది యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారు ఎంతమంది అనేదాని మీద స్పష్టత లేదు.
అమర్నాథ్ వరదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడారు. యాత్రికులను కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యమని అమిత్ షా తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 15మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
అమర్నాథ్ వరదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడారు. యాత్రికులను కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యమని అమిత్ షా తెలిపారు. మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమర్నాథ్ వరదలపై సమీక్షించారు. కేంద్ర పాలిత ప్రాంత అధికారులతో కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉందని చెప్పారు. అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
మరోవైపు, అమర్‌నాథ్‌లో చోటుచేసుకున్న విషాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధితులకు అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడాను. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజల ప్రాణాలను కాపాడడమే మా ప్రాధాన్యత అని అమిత్ షా తెలిపారు.