ఉన్నట్టుండి భూమి కుంగిన ఘటనలను చాలాసార్లు చూసి ఉంటాం. విని ఉంటాం. కానీ అదే భూమి లోపలి నుంచి పైకి ఎగదోసుకుంటే వస్తే.. అలా జరగదు కానీ వస్తే అది ఎంత పెద్ద వింత అవుతుంది. అలాంటి వింత ఇప్పుడు హర్యానాలో వెలుగుచూసింది. చెరువు గట్టులాంటి ప్రాంతం వద్ద కొందరు యువకులు కూర్చొని ఉండగా.. ఉన్నట్టుండి చెరువులో నుంచి భూమి పైకి పొంగుకొచ్చింది . ఏదో గ్రాఫిక్స్ మాయాజాలంలా దాదాపు మీటరు ఎత్తువరకూ పెరిగిపోయింది. దీన్ని అక్కడే యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. ఒక్కరోజులోనే మిలియన్లు వ్యూస్ సంపాదించి హాట్ టాపిక్‌గా మారింది. ఏదో మార్ఫింగ్ చేశారులే అనుకుందాం అంటే.. అలాంటి ఛాయలు ఏమీ కనిపించడం లేదు.