ఇది నగల షాపని ఆగుతుందా.!? నీరు పల్లానికే పోతుంది.! అకాల వర్షం మురుగు నీటిరూపంలో ఆనగల షాపులోనికి ప్రవేశించింది. అప్పటిదాకా మురిసిపోతున్న బంగారం మురుగునీరు రమ్మన్న చోటుకి నోరుమూసుకుని పోయింది. ఫలితంగా ఆ షాపు యజమానికి కోట్ల నష్టం.
కొంత కాలంగా ఎండలు ఎలా కాస్తున్నాయో అకాల వర్షాలు కూడా అలాగే అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి బెంగుళూరు నగరంలోని వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
ఈ క్రమంలో మల్లీశ్వర్ ప్రాంతంలోని నిహాన్ జ్యువెల్లరీ అనే నగల దుకాణంలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. దీంతో షాపులో ఉన్న రూ.2 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయానని నిహాన్ జ్యువెల్లరీ యజమాని ప్రియ తెలిపారు.
చెత్తాచెదారంతో నీరు ఉద్ధృతిగా ప్రవహించడం వల్ల దుకాణం షట్టర్లను మూయలేకపోయామని ఆయన చెప్పారు.దుకాణంలోని బంగారం ఆభరణాలు తడిసిపోయాయి. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి సాయం కోరినా స్పందించలేదు.
దుకాణంలో ఉన్న 80 శాతం నగలు అంటే దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు వరదలో కొట్టుకుపోయాయి’ అని నిహాన్ జ్యువెల్లరీ యజమాని ప్రియ కన్నీంటి పర్యంతమయ్యారు. మరోవైపు.. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో రోడ్లు గుంతలుగా మారాయి.
దీంతోవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అలాగే మహాలక్ష్మి లేఅవుట్ పరిధిలో 20 ఇళ్లు ముంపునకు గురైనట్లు సమాచారం. నగరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు బెంగళూరు మున్సిపల్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు