కంత్రి, బిల్లా, శక్తి, షాడో సినిమాలకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు. వరుస సినిమాలు ఫ్లాప్ కావటంతో నిర్మాతలు కూడా సినిమాలు చెయ్యటానికి వెనుకడుగు వేస్తున్నారు. అలా మెహెర్ రమేష్ కి ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. కాగా ఇపుడు మెగా స్టార్ చిరంజీవి అతనికి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చాడట. 2015 లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు మెహెర్ రమేష్ రెడీ అయ్యాడట.
చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి అనుగుణం గా ఆయన సలహాతో మార్పులు చేర్పులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ .వి . ప్రసాద్ తెలుగులో నిర్మించబోతున్నాడట. గతంలో చిరంజీవి చేసిన రీమేక్ చిత్రాలైన ” పున్నమి నాగు, విజేత , పసివాడి ప్రాణం , చట్టానికి కళ్లులేవు , ప్రతిబంద్ , హిట్లర్ , ఘరానా మొగుడు, ఠాగూర్ , శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్ , ఖైదీ నెం.150 ” వంటి రీమేక్ లు అన్నీ బ్లాక్ బస్టర్స్ కావడం విశేషం . అందువల్లనే చిరంజీవి రీమేక్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరో వైపు చిరుకు మెహర్ రమేష్ మేనల్లుడు కావటంతో కూడా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.