స్వాతంత్ర్య దినోత్సవంలో తొలిసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలీకాప్టర్లు ఆకాశం నుండి పూలవర్షాన్ని కురిపించాయి. చారిత్రక ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఎగరేసిన మరుక్షణం ఈ అద్భుతదృశ్యం చోటుచేసుకుంది. ఒకదాని వెంట మరొకటి.. రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఆవిష్కరించిన ఈ సన్నివేశం ఎంతో ఆకట్టుకుంది.
For the first time, flower petals showered at Red Fort as PM @narendramodi unfurls the tricolour🇮🇳#IndiaIndependenceDay #IndiaAt75 #AmritMahotsav pic.twitter.com/fBll6lRVNS
— PIB India (@PIB_India) August 15, 2021
Advertisements
మొదటి హెలీకాప్టర్ వింగ్ కమాండర్ ను బలదేవ్ సింగ్ బిష్త్ నియంత్రిస్తే.. రెండవ హెలికాప్టర్ ను
వింగ్ కమాండర్ నిఖిల్ మెహ్రోత్ర కమాండ్ చేశారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన వారికి పూలవర్షం కొత్త అనుభూతినిచ్చింది. ఎర్రకోటనే సంతోషం పట్టలేక .. తన ఆనందాన్ని తిరిగి పూలవర్షంలా కురిపించిందమో అన్నట్టుగా ఆ దృశ్యం సాక్షాత్కరించింది. ఈ సారి వేడుకల్లో ఇదే హైలెట్గా నిలిచింది.