దేశ ఆర్థిక వ్యవస్థపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. భారత్ లో ఆర్థిక అభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టి పెడతారని పేర్కొన్నారు. చైనా మానవ వనరులను సమృద్ధిగా ఉపయోగించుకుందన్నారు. నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ జాతీయ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జపాన్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని వెల్లడించారు. జపాన్ సంబంధించిన వ్యవస్థలపై పెట్టుబడులు సరిగా పెడుతోందని తెలిపారు ఆయన. భారత్ లో ఆర్థిక అభివృద్ధి కన్నా..రాజకీయాలపై దృష్టి పెడతారని కేటీఆర్ తెలిపారు. ఇతర దేశాల లాగే మన దేశంలో ఆర్థిక అభివృద్ధి పై దృష్టి పెడితే..నంబర్ వన్ గా ఎదుగుతారని అన్నారు.
తెలంగాణలో తలసరి ఆదాయం 2014లో 1.24 లక్షలు ఉందని.. ప్రస్తుతం తలసరి ఆదాయం 2.78 లక్షలు అయిందని స్పష్టం చేశారు. దేశంలో తలసరి ఆదాయం 1.49 లక్షలు మాత్రమేనని వివరించారు. మన దేశ ఆర్థిక వనరులను ఉపయోగించుకుంటే ఇప్పటికే నంబర్ వన్ స్థాయిలో ఉండేదన్నారు. మన దేశం చైనా,జపాన్ ల కంటే వెనుకబడిపోయిందన్నారు.
ఇక తెలంగాణలో ప్రస్తుతం తలసరి ఆదాయం 2.78 లక్షలు. ప్రస్తుత దేశ తలసరి ఆదాయం ఒక లక్ష49 వేలు. అంటే తెలంగాణ తలసరి ఆదాయం కంటే దేశ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. దీన్ని చూస్తుంటే దేశం ఎలాంటి నాయకుల చేతిలో ఉందో తెలుస్తుందన్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ ఆర్ నిపుణలు హాజరయ్యారు.