ఉత్తర భారతంలో మంచుతో కూడిన శీతల వాతావరణం కొంతవరకు తగ్గుతోంది. ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో శీతల గాలుల ప్రభావం తగ్గినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గురువారం తేలికపాటి వర్షం కురవ వచ్చునని, పగటి ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చునని వెల్లడించింది.
నిన్నటివరకు దట్టంగా కమ్మేసిన పొగమంచు కొంత తెరపినిచ్చింది. పశ్చిమ దిశనుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల కనీస ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరభారతంలో మంచు కురుస్తున్నప్పటికీ వాహనాల రాకపోకలను గుర్తించే పరిస్థితి మెరుగుపడినట్టు తెలుస్తోంది.
పంజాబ్ నుంచి బీహార్ వరకు హర్యానా, ఢిల్లీ, యూపీ వ్యాప్తంగా ఓ మాదిరి నుంచి మరికొంత హెచ్చు స్థాయి వరకు మంచు పొరలు వ్యాపించాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ముఖ్యంగా ఉదయం వెళ్లాలో దీని ప్రభావం కనిపిస్తుందన్నారు. మరో రెండు రోజులు ముఖ్యంగా ఉత్తరాదిన ఈ వాతావరణ పరిస్థితి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. శీతల వాతావరణం కారణంగా దేశంలో 95 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తునట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.